బలవంతంగా పురుగుల మందు తాగించి..

బలవంతంగా పురుగుల మందు తాగించి..

భూ తగాదాల వల్ల ఓ వ్యక్తికి బలవంతంగా పురుగుల మందు తాగించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన అమ్ముల రామస్వామి, అమ్ముల రాములు అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు. వీరి మధ్య గత కొంత కాలం నుంచి భూవివాదం నడుస్తోంది. రామస్వామికి చెందిన ఏడెకరాల భూమిని రాములు కొడుకులు మహేష్, అరవింద్ లు నకిలీ పాస్ బుక్కులు సృష్టించి వారి పేరు మీద రాయించుకున్నారు. ఈ విషయం మీద ఇరు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా పంచాయతీలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం రామస్వామి పొలం వద్ద పనులు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన అరవింద్, మహేష్, మరోవ్యక్తి వెంకటేష్ ముగ్గురూ కలిసి రామస్వామి చేత బలవంతంగా పురుగులమందు తాగించారు. తండ్రి రామస్వామి చీకటిపడ్డా ఇంటికి రాకపోవడంతో కొడుకు సంతోష్ బావి దగ్గరకు వెళ్లాడు. అప్పటికే రామస్వామి పొలం గట్టున పడి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని తండ్రి రామస్వామిని అడిగితే జరిగిన విషయం చెప్పాడు. వెంటనే రామస్వామిని కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి పేట అశ్విని హాస్పిటల్ కు తరలించారు. తన చేత బలవంతంగా పురుగుల మందు తాగించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని రామస్వామి తన ఆవేదన వ్యక్తం చేశాడు. రామస్వామి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఆర్బీఐ పరిధిలోకి కో-ఆపరేటివ్ బ్యాంకులు

న్యూజెర్సీలో కొత్త ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడి భారత కుటుంబం మృతి

రష్యా విక్టరీ డే పరేడ్ లో రాజ్‌నాథ్ సింగ్…