- బిల్లు మాఫీపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
లాక్ డౌన్ టైంలో శ్లాబ్ సిస్టం అమలు చేయకుండా ఎక్కువ బిల్లులు వసూలు చేశారంటూ దాఖలైన పిల్‌లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. లాక్‌డౌన్ విధించిన మార్చి, ఏప్రిల్, మే నెలల కరెంట్ బిల్లులు మాఫీ చేయాలంటూ దాఖలైన పిల్స్ ను విచారణకు స్వీకరించింది. మహ్మద్ వలీ ఉల్లా సమీర్, నరేష్ విడివిడిగా వేసిన ఈ పిల్స్ ను విచారించిన చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డిల డివిజన్ బెంచ్ .. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శ్లాబ్ ల అమలు సహా ఇతర వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీని (ఈఆర్సీ) ఏర్పాటు చేసిన దృష్ట్యా దీనిపై తాము విచారణ చేయబోమని హైకోర్టు వెల్లడించింది. పిటిషనర్‌కు ఉన్న అభ్యంతరాలను ఆ కమిటీ ముందు ప్రస్తావించాలని సూచించింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. కమిటీ గురించి చాలామందికి తెలియదని, తెలిసిన వాళ్లు కూడా అందరూ అక్కడికి వెళ్లలేరని చెప్పారు. ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇప్పటికే 6678 ఫిర్యా దులను కమిటీ పరిష్కరించిందని, మరో 89 కంప్లయింట్లు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కమిటీ గురించి ప్రచారం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. కరెంట్ బిల్లుల మాఫీ పిల్ లో ప్రభుత్వంతోపాటు ఎస్‌పీడీసీఎల్‌కు నోటీసులు ఇచ్చి, విచారణ 2 వారాలకు వాయిదా వేసంది.

