పేదలకు ఉచితంగా సేవా భారతి ఐసొలేషన్ సెంటర్

పేదలకు ఉచితంగా సేవా భారతి ఐసొలేషన్ సెంటర్

రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ వేవ్ తో కరోనా తీవ్ర స్ధాయిలో విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితులను ఆదుకునేందుకు కొందరు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమలోనే సేవా భారతి పేద ప్రజల పాలిట వరంలా మారింది. కరోనా బారిన పడి వైద్యం చేయించుకునే స్థోమత లేని వారికోసం ఉచితంగా అసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఫ్రీగా వైద్యం అందిస్తోంది సేవా భారతి.

హైదరాబాద్ అన్నోజిగూడలో సేవా భారతి నిర్వాహకులు కొవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 200 పడకల ఈ సెంటర్ లో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కరోనా పేషెంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు కొవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.  దీంతో సెంటర్ లోని డాక్టర్లు ఆన్‌లైన్ ద్వారా సలహాలిస్తారు. ప్రతిరోజూ వేలాది మంది ఫోన్ చేసి తమ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటలలోపు 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై డాక్టర్ల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.

కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.