హైదరాబాద్ సిటీ, వెలుగు: నీటి సరఫరా టైమ్లో నల్లాలకు మోటార్లు బిగించిన పలువురిపై వాటర్బోర్డు యాక్షన్తీసుకున్నది. ఓఅండ్ఎం డివిజన్ నంబర్-6, ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు విజిలెన్స్అధికారులకు సమాచారమివ్వగా నీటి సరఫరా టైంలో రైడ్స్చేశారు. ఏడు మోటార్లను స్వాధీనం చేసుకుని సీజ్చేశారు. మొదటిసారి సీజ్ చేస్తామని, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. తక్కువ ప్రెజర్ తో నీళ్లు వచ్చినా, నీటి సరఫరాలో సమస్యలు ఉన్నా దగ్గర్లోని మేనేజర్, డీజీఎం, జీఎంను సంప్రదించాలని లేదా కస్టమర్ కేర్ నంబర్155313 కు ఫోన్చేయాలన్నారు.
