ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు హతం

ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు హతం

ఛత్తీస్గఢ్ దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్ పూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో 2024, జూన్ 8వ తేదీ శనివారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  పక్కా సమాచారంతో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు... మావోయిస్టులు ఎదరుపడ్డారు.  దీంతో రెండు వర్గాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.  

ఈ ఎన్ కౌంటర్ లో.. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.  మృతిచెందినవారు నారాయణ్ పుర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లా వాసులుగా పోలీసులు అధికారులు గుర్తించారు. సంఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధ సమాగ్రి, తుపాకులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోందని నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ చెప్పారు.

జూన్ 7వ తేదీ శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో నారాయణపూర్ డీఆర్‌జీకి చెందిన ముగ్గురు జవాన్లను గాయపడ్డారు. వారిని ఈస్ట్ బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ ప్రాంతం నుంచి విమానంలో ఆస్పత్రికి తరలించారు.
 
మే 25న బీజాపూర్‌లోని జప్పెమార్క, కమ్‌కనార్‌ అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. అనంతరం, జూన్ 2న నారాయణపూర్ జిల్లాలోని దుర్మి గ్రామంలో నక్సలైట్లు మొబైల్ టవర్‌కు నిప్పు పెట్టారు.