
కోరుట్ల, వెలుగు: కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లలోని డాక్ బంగ్లా ఏరియాకు చెందిన అవేస్, ఫయాజ్, సమీర్, ఫుర్ ఖాన్, సర్వర్ నగర్‌కు చెందిన సైఫ్, బెండపల్లికి చెందిన మౌలానా ఆమెర్, కైఫ్ గురువారం అర్ధరాత్రి వరకు ఈద్గా మస్జీద్ ఆవరణలో పని చేశారు. అనంతరం టీ తాగేందుకు కారులో కోరుట్ల నుంచి మెట్‌పల్లి సమీపంలోని మారుతినగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు.
టీ తాగి తిరిగి వస్తుండగా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారిని మెట్‌పల్లి హాస్పిటల్‌కు అక్కడి నుంచి జగిత్యాల, కరీంనగర్ హాస్పిటళ్లకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.