గుజరాత్‌‌లో జంతువుల కోసం ప్రత్యేక శిబిరాలు

గుజరాత్‌‌లో జంతువుల కోసం ప్రత్యేక శిబిరాలు

దేశంలో అనేక ప్రాంతాల్లో వరుణుడి బీభత్సం ఇంకా కంటిన్యూ అవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో గుజరాత్ అతాలకుతలమైంది. వేలాది మంది నిరాశ్రులయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం అధికంగానే ఉందని తెలుస్తోంది. పెద్ద మొత్తంలో వరద నీరు ముంచెత్తింది. నివాసితులు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లారు. వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్న క్రమంలో.. పలు రహదారులపై రాకపోకలను బంద్ చేశారు. వర్షం కారణంగా నవ్ సారిలో బీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. జంతువులను, పక్షులను రెస్క్యూ టీం రక్షించింది. వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆకలితో అలమటిస్తున్న జంతువులకు రెస్క్యూ టీం ఆహారం అందించింది.

మరోవైపు.. వరదల కారణంగా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. నష్టపోయిన వారందరికీ పరిహారం అందచేస్తామని గుజరాత్ ప్రభుత్వం హామీనిచ్చింది. సాధారణం కంటే అధికంగానే వర్షాలు పడ్డాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సాధారణ పౌరులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి.