
ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే విస్తృతంగా వ్యాపిస్తోంది కరోనా. సింగపూర్ లో ఈ ఏడాది ఇప్పటికే 14 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఏడాది కంటే 28 శాతం అధికమని తెలుస్తోంది. సింగపూర్ సహా..చైనా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏసియాలో వేగంగా వ్యాపిస్తోంది కరోనా. ఆయా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | భారత్ ఏం ధర్మసత్రం కాదు.. శరణార్థులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
చైనాలో గత సంవత్సరం వేసవి కాలంతో పోల్చితే.. ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో జరిగిన సాంగ్ క్రాన్ ఫెస్టివల్ తర్వాత థాయిలాండ్ లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనాల్లో లాక్ డౌన్ భయం మళ్ళీ మొదలైంది.. అయితే, కొత్త మ్యూటెంట్ అంత ప్రమాదమేమీ కాదని.. ఇప్పటిదాకా ఈ వైరస్ సోకినవారిలో స్వల్ప అనారోగ్యం మినహా పెద్దగా లక్షణాలేవీ కనిపించలేదని చెబుతున్నారు వైద్యులు.
ఈ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది:
హాంకాంగ్: హాంగ్ కాంగ్ లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.. కోవిద్ టెస్ట్ లో పాజిటివ్ గా నమోదవుతున్నవారి సంఖ్య మార్చిలో 1.7 శాతం ఉండగా.. మే నెలలో ఇది 11.4 శాతం అయ్యిందని తెలిపారు అధికారులు. ఆగస్టు 2024 కంటే ఇది ఎక్కువ అని తెలిపారు. హాంగ్ కాంగ్ లో ఇప్పటిదాకా 81 మందికి తీవ్ర లక్షణాలు కనిపించగా 30 మంది మరణించినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మందికి ముందుగానే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపారు అధికారులు.
సింగపూర్: సింగపూర్ లో మే నెలలో కరోనా వ్యాప్తి 28శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 14 వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య 30 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
చైనా: చైనాలో కూడా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.. గత వేసవితో పోల్చితే ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపయ్యిందని తెలిపారు అధికారులు.
ఆందోళన, భయం అవసరమా:
ఆయా దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో మళ్ళీ లాక్ డౌన్ తప్పదా అనే భయం చాలామందిలో మొదలైంది.. వాస్తవానికి ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని చెబుతున్నారు డాక్టర్లు. ముందుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిపై మాత్రమే తీవ్ర ప్రభావం ఉన్నట్లు తెలిపారు వైద్యులు.