టాటా సన్స్ ఐపీఓ లేనట్టే?

టాటా సన్స్ ఐపీఓ లేనట్టే?

న్యూఢిల్లీ: టాటా సన్స్ ఐపీఓ వస్తోందనే వార్తల కారణంగా ఈ వారం అనేక గ్రూప్ స్టాక్స్ 36 శాతం వరకు పెరిగాయి. పేరెంట్​కంపెనీ  ఆర్​బీఐ నిబంధనలకు కట్టుబడి వివిధ మార్గాలను పరిశీలిస్తున్నందున ఇప్పట్లో లిస్టింగ్ ఉండబోదని మార్కెట్​పరిశీలకులు అంటున్నారు. టాటా సన్స్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐలో సీఐసీగా రిజిస్టర్​అయింది. 'అప్పర్​ లేయర్' ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీగా దీనిని పిలుస్తారు.  దీనివల్ల కంపెనీ కఠినమైన నియంత్రణ నిర్మాణాన్ని అనుసరించాలి. 

నోటిఫై చేసిన మూడు సంవత్సరాలలోపు పబ్లిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్ట్​ కావాల్సి ఉంటుంది.  సెప్టెంబర్ 2025 నాటికి టాటా సన్స్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావాలి. అయితే టాటా సన్స్​ మాత్రం టాటా క్యాపిటల్​ను విడదీయడంతో సహా రకరకాల ప్రపోజల్స్​ను పరిశీలిస్తోంది.