గుజరాత్ లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

గుజరాత్ లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకారం, గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో ఉన్న పార్డి, వల్సాద్ ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో వరుసగా 169 మిమీ, 168 మిమీ భారీ వర్షపాతం నమోదైంది. సూరత్‌లోని కమ్రెజ్‌లో 149 మిమీ, నవ్‌సారిలోని ఖేర్గామ్ ప్రాంతంలో 147 మిమీ వర్షపాతం నమోదైంది.

భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షపాతాలు నమోదవుతున్నందున, గుజరాత్‌లోని అనేక ప్రాంతాలలో కూడా జూన్ 29న తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకారం, వల్సాద్ జిల్లాలోని పార్డి, వల్సాద్ ప్రాంతాల్లో గత 24 గంటల్లో వరుసగా 169,168 మిమీ భారీ వర్షపాతం నమోదైంది. సూరత్‌లోని కమ్రెజ్‌లో 149 మిమీ వర్షపాతం నమోదు కాగా.. నవ్‌సారిలోని ఖేర్గామ్ ప్రాంతంలో 147 మిమీ వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలోని వల్సాద్, తాపి, నవ్‌సారి, నర్మదా, సూరత్ రూరల్, వడోదర రూరల్ జిల్లాల్లో కుండపోత వర్షం కొనసాగుతోంది. నవ్సారి, వల్సాద్ జిల్లాలకు ఇప్పటికే అధికారులు "రెడ్ అలర్ట్ హెచ్చరిక" జారీ చేశారు, ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు జూన్ 27న తెలిపారు.

ఈరోజు ఉదయం  దేశ రాజధాని ఢిల్లీలోనూ వేడిగాలుల నుంచి ఉపశమనం కలిగింది. వర్షపాతం తర్వాత ఢిల్లీ ఆహ్లాదకరమైన వాతావరణంతో మేల్కొంది. IMD ప్రకారం, నగరంలో జూన్ 29న ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షం/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.