Trains Cancelled: కాజీపేట-బల్లార్ష మధ్య పలు రైళ్లు రద్దు

Trains Cancelled: కాజీపేట-బల్లార్ష మధ్య పలు రైళ్లు రద్దు

కాజీపేట – బల్హర్షా సెక్షన్ల మధ్య నాన్ – ఇంటర్‌ లాకింగ్ పనుల  కారణంగా, ఫిబ్రవరి 14 నుంచి 24 తేదీల్లో రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో మొత్తం 24 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు పాక్షికంగా నిలిపివేశారు. వీటిలో 7రైళ్లను పూర్తిగా, 17 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి, అందుకు అనుగుణంగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.