పెళ్లి పేరుతో శారీరకంగా కలవడం రేప్ కిందకు రాదు

పెళ్లి పేరుతో శారీరకంగా కలవడం రేప్ కిందకు రాదు

ఒక పురుషుడితో స్త్రీ చాలా కాలంగా ప్రేమగా ఉన్న పరిస్థితుల్లో… పెళ్లి పేరుతో శారీరకంగా కలవడం రేప్ కిందకు రాబోదని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎక్కువ కాలం క్లోజ్ గా ఉన్నప్పుడు… పెళ్లి చేసుకుంటానని చెప్పడం, శారీరక బంధం వైపు ప్రోత్సహించడంగా చెప్పలేమని స్పష్టం చేసింది. ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

2008లో నిందితుడితో పరిచయం ఏర్పడిందని, 3 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని అతను మాట ఇచ్చాడని… దీంతో అతనితో తాను కలసి వెళ్లానని ఆ సమయంలో  తనపై అతను అత్యాచారం చేశాడని తన పిటిషన్ లో తెలిపింది. అయితే.. ఈ ఆరోపణల నుంచి నిందితుడికి హైకోర్టు విముక్తి కల్పించింది. దీన్ని రేప్ గా పరిగణించలేమని తెలిపింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది.