ఫ్రాన్స్​ చర్చిలలో చిన్నారులపై  లైంగిక వేధింపులు

V6 Velugu Posted on Oct 06, 2021

  • 70 ఏళ్లుగా దారుణంబాధితులు 3 లక్షలకు పైనే

పారిస్: ఫ్రాన్స్ లో బయటపడిన ఘోరమిది. ఏడాదో రెండేళ్లో కాదు.. 70 ఏండ్లుగా అక్కడి రోమన్​ కేథలిక్​  చర్చిలలో చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. దాదాపు 3.30 లక్షల మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యారు. వీరిలో 80% మంది మగ పిల్లలేనని ఇండిపెండెంట్ కమిషన్ రిపోర్టు వెల్లడించింది. మొత్తం 2,500 పేజీల రిపోర్టును కమిషన్ మంగళవారం విడుదల చేసింది. బాధితుల్లో 2.16 లక్షల మంది మతాధికారుల చేతుల్లో వేధింపులకు గురయ్యారని రిపోర్టులో వెల్లడించింది. చర్చిలో 1950 నుంచి అఘాయిత్యాలు జరిగాయని, మొత్తం 3 వేల మంది ఈ దారుణాలకు పాల్పడ్డారని, నిందితుల్లో మతాధికారులే ఎక్కువని తెలిపింది. ‘ఇన్ని దారుణాలు జరుగుతున్నా, వాటిని అడ్డుకోవడానికి చర్చి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బాధితులకు ఎలాంటి సాయం అందించలేదు’అని కమిషన్ ప్రెసిడెంట్ జీన్ మార్క్ సావే చెప్పారు. చర్చిలలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో 2018లో కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ రెండున్నరేండ్లు దర్యాప్తు చేసి, రిపోర్టు ఇచ్చింది. పోయినేడాది ఇదే చర్చి మతాధికారి బెర్నార్డ్ ప్రీనాట్​కు లైంగిక వేధింపుల కేసులో ఐదేండ్ల జైలు శిక్ష పడింది.

Tagged children, France, sexual, Abuse, churches,

Latest Videos

Subscribe Now

More News