ఇండియా పేరును మార్చడం అనాగరికం.. ఎన్సీఈఆర్టీ కమిటీపై ఎస్ఎఫ్ఐ ఫైర్

ఇండియా పేరును మార్చడం అనాగరికం.. ఎన్సీఈఆర్టీ కమిటీపై ఎస్ఎఫ్ఐ ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఇండియా పేరును భారత్ గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని, వాటిని తిరస్కరించాలని ఎస్ఎఫ్ఐ, టీఎస్​యూటీఎఫ్​ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. ఇప్పటివరకు మనదేశాన్ని ఇంగ్లీష్ లో ఇండియా అని పిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందేననీ వేర్వేరు ప్రకటనల్లో  తెలిపాయి.  

కానీ రాజకీయ దురుద్దేశ్యంతో  పేరు మార్చాలని చూస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్​మూర్తి, కార్యదర్శి నాగరాజు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, , కార్యదర్శి చావ రవి ఆరోపించారు. రాజకీయ ప్రేరేపిత వ్యక్తుల వల్ల విద్యారంగం సర్వ నాశనం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ, దేశ చరిత్రను ఏక పక్షం చేయాలనుకోవటం తగదన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎన్సీఈఆర్టీ కమిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు .