హుస్నాబాద్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

హుస్నాబాద్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

హుస్నాబాద్, వెలుగు: పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్స్​వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్​లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీసును మంగళవారం ముట్టడించేందుకు యత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అభిషేక్ బాలు, కార్యదర్శి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్​చేశారు. 

స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్స్​ఆలస్యమవడంతో పేద విద్యార్థులు చదువులు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రాహుల్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మణ్ నాయక్, ఆదిత్య పాల్గొన్నారు.