ఉత్సాహంగా నేషనల్ లెవల్ కబడ్డీ పోటీలు..వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో ఏడూళ్ల బయ్యారం సందడి

ఉత్సాహంగా నేషనల్ లెవల్ కబడ్డీ పోటీలు..వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో ఏడూళ్ల బయ్యారం సందడి

పినపాక, వెలుగు: భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్​లో ఎస్జీఎఫ్​అండర్​–-17 బాలుర నేషనల్​లెవల్​కబడ్డీ పోటీలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు, కోచ్​లతో ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్ సందడిగా మారింది. 

రెండో రోజు జరిగిన 18 లీగ్​మ్యాచ్​ల్లో పంజాబ్​పై మధ్యప్రదేశ్, కేంద్రీయ విద్యా సమితిపై విద్యాభారతి, చండీఘర్ పై ఒడిశా, త్రిపురపై ఏపీ, సీఐఎస్​సీఈపై పుదుచ్చేరి, తమిళనాడుపై తెలంగాణ, ఢిల్లీపై కర్ణాటక, హిమాచల్​ప్రదేశ్​పై మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ పై రాజస్థాన్​, కేవీఎస్​పై హర్యానా, ఎన్​వీఎస్​పై మధ్యప్రదేశ్​, జార్ఖండ్​పై మణిపూర్​, వెస్ట్​బెంగాల్​పై సీబీఎస్ఈ, జమ్ముకాశ్మీర్​పై గుజరాత్​, చత్తీస్​గఢ్​పై యూపీ, ఎన్​వీఎస్​పై పంజాబ్​, సీబీఎస్​ఈపై కేరళ, విద్యాభారతిపై అసోం జట్లు విజయం సాధించాయి.  హర్యానా టీమ్​71పాయింట్స్​తో, ఏపీ టీమ్70తో ప్రతిభను చాటాయి. పోటీలను డీఈవో బి.నాగలక్ష్మి మౌరిటెక్​ఫౌండేషన్​, కంది చారిటబుల్​ ట్రస్ట్​ నిర్వాహకులు పర్యవేక్షించారు.