మే, జూన్ లో బ్రహ్మాండమైన ముహూర్తాలు, ఈసారి లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు

మే, జూన్ లో బ్రహ్మాండమైన ముహూర్తాలు, ఈసారి లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు

శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. జీవించు నూరేళ్లు.. ఇలా ఊరూరా పెళ్లి సందడి నెలకొంటోంది. కల్యాణ మంటపాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గుళ్లు, ఇలా వివాహవేడుకలతో కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది మేలో 13 రోజుల్లో . జూన్ లో 11రోజుల్లో   గొప్ప శుభ ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు.  ఈ ఏడాది జూన్ 7, 12, 24  తేదీలలో ఉన్న ముహూర్తాలకు ఎంతో బలం ఉందని కొంతమంది వేద పండితులు చేబుతున్నారు.  ఈ రోజులలో ఉన్న లగ్న బలం చాలా గొప్పదట.  ఏ నక్షత్రం వారికైనా ఆయా తేదీలలో ఉన్న ముహూర్తం జాతకరీత్యా ఎంతో గొప్పదని కొంతమంది పంచాగకర్తలు అంటున్నారు.

ముహూర్తం  ఎలా..

 హిందూ సంప్రదాయం ప్రకారం, శుభప్రదమైన వివాహ తేదీని పరిగణనలోకి తీసుకోవడం మరియు షాదీ ముహూర్తం ప్రకారం వివాహం చేసుకోవడం దంపతుల మధ్య బంధం ఏడు జన్మల పాటు కొనసాగేలా చేస్తుంది.  శుభ ముహూర్తంలో  పవిత్రమైన వాగ్దానాలు చేయిస్లూ పెళ్లిళ్లు జరిపిస్తుంటారు పండితులు.   జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశుల కలయికతో ఏర్పడిన శుభ యోగంలో మాత్రమే వివాహం ఇతర శుభ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఎందుకంటే సరైన సమయంలో చేసే శుభ కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతాయని నమ్ముతుంటారు. అన్నిటికంటే ముహూర్త బలం ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయని చెబుతుంటారు.  కొన్ని కొన్ని ముహూర్తాల్లో శుభ కార్యక్రమాలు జరిపితే  తాతమ్మ, అమ్మమ్మలు కూడా చెబుతుంటారు.  అయితే ఇప్పటి ప్రజానీకం అంతా చాదస్తమని కొట్టిపారేస్తున్నారు.  కాని శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకొనేందుకు  వేదపండితుల దగ్గరకు వెళుతుంటారు.  మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఉన్న ముహూర్తాలను తెలుసుకోండి

మే.. .జూన్ నెలల్లోని ముహూర్తాలు
మే 6, 2023: ముహూర్తం - రాత్రి 09:13.... - ఉదయం 05:44
మే 8, 2023: ముహూర్తం - రాత్రి 12:49 - ...ఉదయం 05:43
మే 9, 2023: ముహూర్తం - 05:43 am..... - 05:45 am
మే 10, 2023: ముహూర్తం - సాయంత్రం 04:12..... - ఉదయం 05:42
మే 11, 2023: ముహూర్తం - ఉదయం 05:42 - .... ఉదయం 11:27 am
మే 15, 2023: ముహూర్తం - రాత్రి 01:30 - ... ఉదయం 05:39
మే 16, 2023: ముహూర్తం - ఉదయం 05:39 -...  రాత్రి 01:48
మే 20, 2023: ముహూర్తం - సాయంత్రం  05:18 ... ఉదయం - 05:37 am
మే 21, 2023: ముహూర్తం - ఉదయం 05:37 - 
22 మే 2023: ముహూర్తం - ఉదయం 05:36 ...  - ఉదయం10:37 
మే 27, 2023: ముహూర్తం - రాత్రి 08:51 - రాత్రి 11:43 వరకు
29 మే 2023: ముహూర్తం - రాత్రి 09:01 - మే 20 ఉదయం 05:34 వరకు
30 మే 2023: ముహూర్తం - ఉదయం 05:34 నుండి రాత్రి 08:55 వరకు

జూన్ 1, 2023: ముహూర్తం - ఉదయం 06:48 ...  సాయంత్రం 07:00 వరకు
జూన్ 3, 2023: ముహూర్తం - ఉదయం 06:16 ...  ఉదయం11:16 
జూన్ 5, 2023: ముహూర్తం - జూన్ 6 ఉదయం 08:53 
జూన్ 6, 2023: ముహూర్తం - మధ్యాహ్నం 12:50
 7 జూన్, ఉదయం 05:23 - ఉదయం 05:30 
జూన్ 11, 2023:  - మధ్యాహ్నం 02:32 
 జూన్ 12 ఉదయం 05:23 వరకు
23 జూన్ 2023:  - ఉదయం 11:03 
 24 జూన్ 05:24 వరకు... ఉదయం  11:16 
26 జూన్ 2023 ఉదయం 05:25....  - మధ్యాహ్నం 01:19 
27 జూన్ 2023:  - ఉదయం 09:50 ...  సాయంత్రం 04:30