పారిశ్రామిక కారిడార్ గా షాబాద్ డెవలప్ : మేయర్ విజయలక్ష్మి

పారిశ్రామిక కారిడార్ గా షాబాద్ డెవలప్ : మేయర్ విజయలక్ష్మి

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్​ నగరానికి సమీపంలో ఉన్న షాబాద్​ మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని నగర మేయర్​ విజయలక్ష్మి అన్నారు. రంగారెడ్డి  జిల్లా షాబాద్ మండలంలో ఆదివారం నీలోఫర్ టీ పౌడర్ ప్యాకింగ్ కంపెనీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో డెవలప్​ అవుతోందన్నారు.

 ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నాయకులు జనార్ధన్​రెడ్డి, అశోక్, ప్రభాకర్​రెడ్డి, స్వామి, లింగం, రాజేందర్​రెడ్డి, కిశోర్, సుభాష్ రెడ్డి, రాఘవేందర్, నర్సింహారెడ్డి, రఫీక్ తదితరులు 
పాల్గొన్నారు.