ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న 48వేల 5వందల ముపై మూడు మంది కార్మికులను ఉద్యోగాలనుంచి తొలగాంచడాన్ని ఖండించారు కాంగ్రెస్ లీడర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. కామారెడ్డి బస్ డిపోలో సోమవారం ఆర్టీసీ ఉద్యోగులు చేసిన నిరసనను ఉద్దేశించి షబ్బీర్ అలీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ తన ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఆర్టీసీ లో ఉద్యోగాలు ఇవ్వలేదని… అలాంటిది ఒకే స్ట్రోక్ లో 48వేల మందిని ఉద్యోగాలనుంచి తీసేశాడని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని… వారి ఉద్యోగాలు పోకుండా చూస్తామని ఆయన అన్నారు.
2003లో తమిళనాడు సీఎం జయలలిత 1.70లక్షల మంది ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలనుంచి తీసేసిందని అయితే ఆ చర్యను కోర్టు తప్పుపట్టి తిరిగి వాళ్లకు ఉద్యోగాలు లభించేలా నిర్ణయం తీసుకోవడానికి తీర్పునిచ్చిందని గుర్తుచేశారు షబ్బిర్ అలీ. ఇప్పుడు మాత్రం కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను పైవేట్ పరం చేసి లాభపడాలనుకున్నట్లు చెప్పారు.
