గుజరాత్ ఎయిర్ పోర్టులో రాహుల్ ను కలిసిన షబ్బీర్ అలీ

గుజరాత్ ఎయిర్ పోర్టులో  రాహుల్ ను కలిసిన షబ్బీర్ అలీ

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీని  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్ అలీ కలిశారు. మార్చి 12న  గుజరాత్  ఎయిర్ పోర్టు దగ్గర  రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.  అక్కడి నుంచి  భారత్ న్యాయ యాత్రలో పాల్గొనడానికి రాహుల్ గాంధీతో కలిసి హెలికాప్టర్ లో నందర్బార్ కు వెళ్లారు షబ్బీర్ అలీ.  అక్కడ రాహుల్ గాంధీతో కలిసి   భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు.

అధికారంలోకి వస్తే కులగణన

రాహుల్  భారత్  జోడో న్యాయ్ యాత్ర  మార్చి 12న గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని నందర్బార్  జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కులగణన, ఆర్థిక సర్వే అమలు చేస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో బలహీనంగా మారిన అటవీ హక్కుల చట్టాన్ని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.   దేశ జనాభాలో గిరిజనులు 8 శాతం ఉన్నారని, అభివృద్ధి ఫలాల్లో వారికి సరైన వాటా దక్కేలా చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను ఇవ్వడానికి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘అటవీ హక్కుల చట్టాలు, భూ సేకరణ చట్టాలను బీజేపీ ప్రభుత్వాలు బలహీనంగా మార్చాయని మండిపడ్డారు.