గత ప్రభుత్వంలో కలెక్టర్‌‌ నుంచి ఏఎన్ఎం దాకా నిర్బంధం : షాద్ నగర్ ఎమ్మెల్యే

గత ప్రభుత్వంలో కలెక్టర్‌‌ నుంచి ఏఎన్ఎం దాకా నిర్బంధం : షాద్ నగర్ ఎమ్మెల్యే
  • గత ప్రభుత్వంలో కలెక్టర్‌‌ నుంచి ఏఎన్ఎం దాకా నిర్బంధం
  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ కల్పిస్తాం

షాద్ నగర్, వెలుగు: గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో కలెక్టర్ నుంచి ఏఎన్ఎం దాకా ఉద్యోగపరంగా స్వేచ్ఛ లేక నిర్బంధమైన సేవలు అందించారని వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో  విముక్తి లభిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే  వీర్లపల్లి శంకర్ అన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం లాంటిదని,  ప్రస్తుతం ఉన్న 5 లక్షల పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు. 

కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వర రావు, అదనపు అధికారిణి  డాక్టర్ జయలక్ష్మి హాజరయ్యారు. అనంతరం రాజీవ్ ఆరోగ్య శ్రీ ని  ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం 1,383 రోగాలకు చికిత్సలు, సర్జరీలు,289 వైద్య రుగ్మతలకు వరిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సరైన వైద్యం అందలేదని, కొవిడ్ సమయంలో వైద్యాధికారులు, సిబ్బంది సేవ చేశారే తప్ప ప్రభుత్వం సరైన విధంగా ఆదుకోలేదని విమర్శించారు.

తెలంగాణలో ఉద్యోగస్తులు, ఉద్యమకారులు,ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇప్పుడు సహకారమైందని అన్నారు.ఉద్యోగస్తులు కూడా ఎంతో మేలు చేశారన్నారు.ఒక దశలో ప్రభుత్వం రావడానికి ఉద్యోగస్తుల కారణమన్నారు. కార్యక్రమంలో  ఫరూక్ నగర్ జడ్పీటీసీ పి. వెంకట్రామిరెడ్డి, కేశంపేట జెడ్పీటీసీ విశాల, అధికారులు తదితరులు పాల్గొన్నారు.