
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్(Shah Rukh Khan) కి రీసెంట్ గా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైనట్లు వచ్చిన వార్తలు తెలిసేందే.
తాజా సమాచారం ప్రకారం, షారూఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో కనిపించిన తర్వాత తన ముక్కుకు గాయం అయినట్లు వచ్చిన నివేదికలను ఖండించారు. పేపర్లో వచ్చే కథనాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి, కొందరు నిరంతరాయంగా ముక్కు కారుతున్నట్లు పేర్కొంటున్నారు, మరికొందరు నోటికి కుట్లు పడ్డాయని.. లేజర్ శస్త్రచికిత్స చేసుకున్నట్లు రాసారు. ఇదే విషయాన్నీ షారుక్ ముంబై విమానాశ్రయంలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
"ముక్కుకు కలిగిన చిన్నపాటి గాయాలు ఇంత న్యూస్ క్రీయేట్ చేశాయి. బిజీగా గడిపే సెలబ్రెటీలకు సంబంధించి ఏ చిన్నవిషయం కనిపించిన న్యూస్ పెద్దది చేస్తారు అంటూ సమాధానం ఇచ్చాడు. కానీ గాయం ఎలా జరిగిందో మాత్రం వివరించలేదు."
షారూఖ్ ఖాన్ పటాన్ మూవీ తో బాక్సాపీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేసాడు. ప్రస్తుతం అట్లీ(Atlee) డైరెక్షన్ లో వస్తున్న జవాన్ మూవీతో మరో హిట్ కొట్టడానికి సిద్దమయ్యాడు. రాజ్‌కుమార్ హిరానీ(Rajkumar Hirani) దర్శకత్వం వహించిన చిత్రం డుంకీలో కనిపించబోతున్నాడు. ఇది కాకుండా, సల్మాన్ ఖాన్(Salman Khan) యొక్క టైగర్ 3 లో కూడా ప్రత్యేక అతిధి పాత్రలో షారుఖ్ కనిపించనున్నాడు.