KKR vs RR: ఓడినా మనసు గెలుచుకున్నాడు: బట్లర్ ఇన్నింగ్స్‌కు షారుఖ్ ఫిదా

KKR vs RR: ఓడినా మనసు గెలుచుకున్నాడు: బట్లర్ ఇన్నింగ్స్‌కు షారుఖ్ ఫిదా

ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 16) రాజస్థాన్ రాయల్స్, కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను కిక్ ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి రాజస్థాన్ విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం కేకేఆర్ చేతిలో ఉన్నా.. బట్లర్ అసాధారం పోరాటంతో రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్  (60 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 6 ఫోర్లతో 107 నాటౌట్‌‌‌‌) అద్భుత ఇన్నింగ్స్ కు  కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ ఓనర్ షారుఖ్ ఫిదా అయ్యాడు. 

చివరి బంతికి ఒక పరుగు కావాల్సిన దశలో బట్లర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా గ్యాప్ లో కొట్టి సింగిల్ పూర్తి చేసి మ్యాచ్ గెలిపించాడు. రాజస్థాన్ మ్యాచ్ గెలిచిన అనంతరం సంబరాల్లో మునిగిపోయింది. బాలీవుడ్ బాడ్ షా షారుఖ్ సైతం చప్పట్లతో రాజస్థాన్ విజయాన్ని అభినందించాడు. మ్యాచ్ తర్వాత బట్లర్ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. బట్లర్ ను ఆప్యాయంగా హద్దుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన సొంత జట్టు ఓడిపోయిన బాధ పక్కన పెట్టి.. ప్రత్యర్థి జట్టును అభినందించడం ఆకట్టుకుంటుంది.     

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 223/6 స్కోరు చేసింది.వెస్టిండీస్ ఆల్‌‌‌‌రౌండర్ సునీల్ నరైన్ (56 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 109) ఈ ఫార్మాట్‌‌‌‌లో తొలి సెంచరీ సాధించడంతో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ భారతి స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్  (60 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 6 ఫోర్లతో 107 నాటౌట్‌‌‌‌) మరోసారి మ్యాజిక్ చేశాడు.  ఛేజింగ్‌‌‌‌లో తనకు తిరుగులేదని.. బాదుడులో తానే బాద్‌‌‌‌షానని  మళ్లీ నిరూపించుకున్నాడు. సెంచరీతో జట్టును ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.