V6 News

వైష్ణోదేవి ఆలయంలో షారూక్ ఖాన్ ప్రత్యేక పూజలు

వైష్ణోదేవి ఆలయంలో షారూక్ ఖాన్ ప్రత్యేక పూజలు

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ జమ్మూలోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు.. డుంకీ సినిమా ఇటీవల సౌదీ అరేబియాలో షూటింగ్ పూర్తి చేసిన తర్వాత..  ముస్లింల పవిత్ర నగరమైన మక్కాను షారూక్ సందర్శించారు. అంతే కాకుండా అక్కడ మక్కాలో ఉమ్రా చేస్తూ కనిపించారు. తాజాగా.. మాతా వైష్ణోదేవి ఆలయానికి ఆయన తన బాడీగార్డ్స్ తో కలిసి ఫుల్ గా కవర్ చేసి ఉన్న బ్లాక్ దుస్తులు ధరించి వెళుతూ కనిపించారు.  షారుక్ ను గుర్తించిన కొందరు అభిమానులు వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

షారుక్ మతాచారాలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తిగా.. అందరి దేవుళ్లను వారివారి సంప్రదాయాలను ఆయన గౌరవిస్తారని అందువల్లే మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లినట్టు కొందరు చెబుతున్నారు. మరోవైపు తన కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల సినిమా రంగంలోకి డెబ్యూ ఇస్తున్నట్టు అఫీసియల్ గా అనౌన్స్ చేశారు. షారూక్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పఠాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం, అశుతోష్ రానా, సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో షారుక్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. ‘పఠాన్’ జనవరి 25న విడుదల కానుంది.