
ఇటీవల ‘పఠాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్.. ఇప్పుడు ‘జవాన్’గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ మూవీని జూన్ 2న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ డేట్‌కి రావడం లేదంటూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘జవాన్’ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో మాస్క్ ధరించిన హీరో పదునైన ఈటెను పట్టుకుని ఎగురుతున్నాడు.
పోస్టర్‌ను గమనిస్తుంటే మరోసారి షారుఖ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో షారుఖ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. నయనతార, ప్రియమణి హీరోయిన్స్. దీపికా పదుకొణె, విజయ్, సంజయ్ దత్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.