అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్నర్

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్నర్

అంతర్జాతీయ క్రికెట్ కు భారత  క్రికెటర్ షాబాజ్ నదీమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019లో టీమిండియాలో చోటు సంపాదించిన ఈ ఝార్ఖండ్ స్పిన్నర్.. 2 టెస్టు మ్యాచ్ లాడి 8 వికెట్లు తీసుకున్నాడు.  స్లో-లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ గా దేశవాళీ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు.140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 542 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ పై కేవలం 10 పరుగులిచ్చి 8 వికెట్లను తీసుకొని కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.
  
34 ఏళ్ల ఈ సీనియర్ స్పిన్నర్.. కొంతకాలంగా తన మనసులో రిటైర్మెంట్ ఆలోచనలు ఉన్నాయని వెల్లడించాడు. ప్రస్తుతం భారత జట్టు తరపున ఆడే అవకాశాలు సన్నగిల్లడంతో.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి తన రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపాడు.ప్రస్తుతం ప్రపంచ టీ20 లీగ్‌లలో ఆడేందుకు ప్లాన్ చేస్తున్నాని నదీమ్ ESPN క్రిక్‌ఇన్‌ఫోతో అన్నారు. 

ALSO READ :- PSL 2024: పాకిస్తాన్‌లో అన్నీ వింతే..! ఫీల్డర్ పట్టాల్సిన క్యాచ్ బాల్ బాయ్‌ చేతుల్లో.. 

ఝార్ఖండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడాడు. మొత్తం 72 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 48 వికెట్లు పడగొట్టాడు. 2011లో అతని ప్రదర్శనలకు IPL రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. రంజీ ట్రోఫీ 2015-16, 2016-17 సీజన్ లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నదీమ్  నిలిచాడు.