Bloody Daddy Review : షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్.. రిజల్ట్ ఏంటి?

Bloody Daddy Review : షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్.. రిజల్ట్ ఏంటి?

షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లడీ డాడీ' (Bloody Daddy). అలీ అబ్బాస్ జాఫర్(Ali abbas jafar) దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఫ్రెంచ్ ఫిల్మ్ 'స్లీప్ లెస్ నైట్స్' ఆధారంగా వచ్చింది. ఈ సినిమా జియో సినిమా ఓటీటీలో  జూన్ 9 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి  ఈ సినిమా బ్లడీ డాడీ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎలాంటి అనుభూతిని ఇచ్చింది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ: సుమేర్ ఆజాద్ (షాహిద్ కపూర్) ఒక నార్కోటిక్ ఆఫీసర్. కొరోనా సమయంలో జరిగిన ఒక ఆపరేషన్ లో రూ. 50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ దొరుకుతాయి. డ్రాగ్ దందా నడిపే సికిందర్ (రోనిత్ రాయ్) తన డ్రగ్స్ ను తిరిగి సాధించుకోవడం కోసం సుమేర్ కొడుకు అథర్వ్ (సర్తాజ్ కక్కర్)ను కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత ఏమైంది? డ్రగ్స్ బ్యాక్ ఎలా మిస్ అయ్యింది? అక్కడినుండి తండ్రీ కొడుకులు ఎలా బయట పడ్డారు? అనేది మిగతా కథ.   

Also Read ; బెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రూ.2.55 కోట్ల కార్లు లాంచ్

రివ్యూ: యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సీన్లను చాలా బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్. మేకింగ్ వైజ్ చూసుకుంటే సినిమా హాలీవుడ్ స్టైల్ ఫీల్ కలుగుతుంది. ఇక ఫ్రెంచ్ ఫిల్మ్ 'స్లీప్ లెస్ నైట్స్'ను ఇండియన్ నేటివిటీని   తీసుకురావడం కోసం టీమ్ చాలా కష్టపడ్డారు. కానీ కథనంలో వేగం తగ్గిన ఫీల్ కలుగుతుంది. స్రీన్ ప్లే పై ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. 

నటీనటులు: బ్లడీ డాడీ లాంటి సీరియస్ & ఇంటెన్స్ యాక్షన్ రోల్స్ చేయడంలో షాహిద్ కపూర్ స్టయిలే వేరు. ఈ సినిమాలో కూడా తన స్పెషల్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్లలో తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ అను చెప్పాలి. ఇక  సికిందర్ పాత్రలో రోనిత్ రాయ్ కూడా తన డార్క్ విలనిజంను చూపించారు. ఇక సంజయ్ కపూర్, డయానా పెంటీ, సర్తాజ్ కక్కర్ కూడా తమ పాత్రల మేర బాగానే ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ ఇది. పాటలు బావున్నాయి కానీ సినిమాలో సెట్ అవలేదు. ఇక సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. ప్రతీ ఫ్రెమ్ మూడ్ కు తగ్గట్టుగా బాగా సెట్ చేశారు. ముందు చెప్పినట్టు యాక్షన్ సీన్స్ డిజైన్ చాలా బావుంది. 

ఇక మొత్తంగా చెప్పాలంటే.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి బ్లడీ డాడీ బాగా నచ్చుతుంది. కంటెంట్ పరంగా కొత్తదనం ఏమీ లేదు  జస్ట్... యాక్షన్ & యాక్షన్! మధ్యలో థ్రిల్లింగ్ సీన్స్. యాక్షన్ లవర్స్ ఈ వీకెండ్ బ్లడీ డాడీ మూవీని చూసేయొచ్చు.