కార్తీక్ ఆర్యన్ తో ప్రేమపూర్వక చిట్ చాట్ చేసిన షారుఖ్

కార్తీక్ ఆర్యన్ తో ప్రేమపూర్వక చిట్ చాట్ చేసిన షారుఖ్

నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తాను ఇన్సిపిరేషన్ గా భావించే బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌ను కలుసుకున్నాడు. ముందు నుంచే షారుఖ్ కు కార్తి్క్ వీరాభిమని కావడంతో అతడి ఆనందాన్ని అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు కలుసుకున్న కార్తీక్, షారుఖ్ పరస్పరం కౌగిలించుకొని... చిన్నపాటి చాట్ కూడా చేశారు. మాటల మధ్యలో షారుఖ్... కార్తీక్ చెంపలను ఆప్యాయంగా తడుతూ భూల్ భూలయ్యా 2 నటుడి పట్ల ప్రేమగా వ్యవహరించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలో ఇద్దరు తారలు బైక్ పక్కన నిలబడి  వైట్ డ్రెస్ లో ఉండడాన్ని చూడవచ్చు. దీంతో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఈ ఇద్దరు హీరోలు ఒకే స్ర్రీన్ పై చూడడానికి ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.