గుండెపోటుతో మరో వ్యక్తి మృతి..పెద్దపల్లి డీసీసీ చీఫ్ తమ్ముడుకి హార్ట్ ఎటాక్ 

గుండెపోటుతో మరో వ్యక్తి మృతి..పెద్దపల్లి డీసీసీ చీఫ్ తమ్ముడుకి హార్ట్ ఎటాక్ 

గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. చూస్తుండగానే చాలామంది చనిపోతున్నారు. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఈ మధ్య చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా పెద్దపల్లి డీసీసీ చీఫ్ రాజ్ ఠాకూర్ తమ్ముడు శైలేందర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఇంటి నుంచి బయటకు రాగానే శైలేందర్ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలుశైలేందర్ ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.