గాడ్ ఫాదర్ నుంచి లెటెస్ట్ అప్ డేట్

గాడ్ ఫాదర్ నుంచి లెటెస్ట్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి ((Chiranjeevi) లెటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ (Godfather) షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి లెటెస్ట్ అప్ డేట్ వచ్చింది. భాయ్ తో (సల్మాన్ ఖాన్) కాలు కదిపినట్లు.. ప్రభుదేవా అద్భుతంగా నృత్యరీతులు సమకూర్చాడని చిరు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఫొటోలో సల్మాన్, చిరులు డ్యాన్స్ చేస్తునట్లుగా ఉంది. ఈ పాట కచ్చితంగా కన్నుల పండుగగా ఉంటుందని చిరు ట్వీట్ లో తెలిపారు. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో మెరువనున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిరు సరసన నయనతార నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. 

ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించని ఓ చిన్నపాటి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వీడియో, ఫస్ట్ లుక్ లను చూసిన చిరు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే... ఇటీవలే ’ఆచార్య’ గా కనిపించారు. తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ అయిపోయారు. అందులో ‘గాడ్ ఫాదర్’ కూడా ఒకటి. చిరంజీవికిది 153వ సినిమా. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా చేస్తున్న సంగతి తెలిసిందే. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.