మహిళను వేధించిన ఎస్సై.. చాపలు చికెన్ వండుకరావాలని డిమాండ్

మహిళను వేధించిన ఎస్సై.. చాపలు చికెన్ వండుకరావాలని డిమాండ్

నల్లగొండ జిల్లా శాలిగౌరారం ఎస్సై పై ఫిర్యాదు చేసింది ఓ మహిళ. తన అవసరాలు తీర్చాలని ఎస్సై తనను వేధించాడని ఫిర్యాదులో తెలిపింది మహిళ. వివరాల్లోకి వెళ్తే.. శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికని ఓ మహిళ వస్తే ఎస్ఐ వేధింపులకు గురిచేశాడని సదరు మహిళ ఎస్పీ ముందుకు వెళ్లింది. 

తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తన అవసరాలు తీర్చాలని, చాపల కూర, చికెన్ వండుకుని రావాలంటూ ఇబ్బంది పెట్టాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు పై స్పందించిన ఎస్పీ శరత్ చంద్ర వవార్ విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.