ధనుష్‌‌ ఇడ్లీ కడై సినిమాలో షాలినీ పాండే లుక్ రిలీజ్

ధనుష్‌‌ ఇడ్లీ కడై సినిమాలో షాలినీ పాండే లుక్ రిలీజ్

ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. తనకు జంటగా నిత్యామీనన్ నటిస్తోంది. ‘తిరు’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమా ఇది. గత కొద్దిరోజులుగా ఈ చిత్రంలో నటిస్తున్న పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్న ధనుష్‌‌.. శుక్రవారం షాలినీ పాండే లుక్‌‌ను రిలీజ్ చేశాడు. ఇందులో ఆమె మీరా అనే పాత్రను పోషిస్తున్నట్టు తెలియజేశాడు. ఇప్పటివరకూ విడుదల చేసిన నిత్యామీనన్, సముద్రఖని, రాజ్ కిరణ్, పార్తిబన్‌‌ లుక్స్‌‌ టైటిల్‌‌కు తగ్గట్టు రూరల్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో  కనిపిస్తుండగా.. సత్యరాజ్‌‌, షాలిని మాత్రం మోడ్రన్‌‌ లుక్‌‌లో  కనిపించారు. 

సినిమాకు ఎంతో కీలకమైన పాత్రను ఆమె పోషిస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది ‘మహారాజ్‌‌’ అనే హిందీ చిత్రం,  డబ్బా కార్టెల్‌‌ అనే సిరీస్‌‌తో ఆకట్టుకున్న షాలిని.. ఈ సినిమాతో తిరిగి సౌత్‌‌లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకాష్​ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్​ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రం ‘ఇడ్లీ కొట్టు’గా రాబోతోంది. శ్రీ వేదాక్షరి మూవీస్ తెలుగులో విడుదల చేస్తోంది.