ప్రైవేట్​ పార్ట్స్​లో దాచి గోల్డ్​ స్మగ్లింగ్ .. 806 గ్రాముల గోల్డ్​ స్వాధీనం

ప్రైవేట్​ పార్ట్స్​లో దాచి గోల్డ్​ స్మగ్లింగ్ .. 806 గ్రాముల గోల్డ్​ స్వాధీనం
  • ఎయిర్​పోర్టులో పట్టుకున్న కస్టమ్స్​ ఆఫీసర్లు

శంషాబాద్, వెలుగు: ప్రైవేట్ పార్ట్స్​లో దాచి తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం అబుదాబీ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్​ఆఫీసర్లు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. 806 గ్రాముల బంగారాన్ని పౌడర్​గా మార్చి, ఉండలుగా చేసి ప్రైవేట్​పార్ట్స్ లో దాచుకుని తెచ్చినట్లు గుర్తించారు.

బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితునిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 58.8 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.