చొక్కాలో 804 గ్రాముల బంగారం దాచిండు

చొక్కాలో 804 గ్రాముల బంగారం దాచిండు

హైదరాబాద్ : విదేశాల నుంచి అక్రమ పద్ధతుల్లో బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. చొక్కాలో 804 గ్రాముల బంగారం దాచి కుట్టేయించాడు. అదే షర్ట్ ధరించి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన మహమ్మద్ గౌస్ ఖాన్ అనే వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారం బయటపడింది.

విమానం దిగిన తర్వాత తనిఖీలు చేసినా నిందితుడి వద్ద ఏమీ దొరకలేదు. ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అయితే చొక్కా విప్పేటప్పుడు బరువుగా కనిపించడంతో అనుమానంతో పరిశీలించారు. చొక్కా లోపల బంగారం దాచి పైన కుట్లు వేయించినట్లు బయటపడింది. నిందితుడి తెలివికి ఆశ్చర్యపోయిన కస్టమ్స్ అధికారులు పట్టుపడిన బంగారాన్ని సీజ్ చేశారు.