చైనాలో మళ్లీ కరోనా కల్లోలం

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం

కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనా ఫైనాన్షియల్ క్యాపిటల్ షాంఘై సిటీలోనూ కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఒక్కరోజే 4,477 కేసులు నమోదుకావడటంతో లాక్డౌన్ విధించారు. నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. కోవిడ్ టెస్టుల కోసం తప్ప జనం ఎవరూ బయట అడుగుపెట్టొద్దని ఆదేశించారు. 

షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్తో పాటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు నెలవైన పుడోంగ్ జిల్లాలో కేసుల సంఖ్య  భారీగా పెరుగుతుండటంతో అధికారులు అక్కడ లాక్డౌన్ విధించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. హాల్ వేస్, ఓపెన్ ఏరియాల్లు, రెసిడెన్షియల్ కాంపౌండ్స్లో కనీసం వాకింగ్ చేసేందుకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు.  వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయడంతో పాటు ప్రజా రవాణా కూడా నిలిపేశారు. షాంఘై మున్సిపల్ గవర్నమెంట్ కరోనా ట్రీట్మెంట్ కు అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రకియను వేగవంతం చేసింది. 

మరిన్ని వార్తల కోసం..

సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు

పక్క దారి పడుతున్న దళిత బంధు పథకం