15కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ సినిమా పాట

15కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ సినిమా  పాట

శంకర్ సినిమా అనగానే సోషల్ మెసేజ్, గ్రాండ్ విజువల్స్ మాత్రమే కాదు.. కళ్లు తిప్పుకోలేనంత కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా కనిపించే పాటలు కూడా. ప్రేక్షకులకు సరికొత్త ఫీల్‌‌‌‌ను అందించేందుకు పాటల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు శంకర్. ప్రపంచంలోని అత్యద్భుతమైన లొకేషన్స్‌‌‌‌ను తన పాటల్లో చూపిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్‌‌‌‌ మూవీ విషయంలోనూ అలాంటి విజువల్‌‌‌‌ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కొద్దిరోజుల క్రితం న్యూజిలాండ్ వెళ్లారు. రామ్ చరణ్, కియారా అద్వాని జంటపై ఓ పాటను అక్కడ చిత్రీకరించారు.  ఈ సాంగ్ షూట్ పూర్తయిన విషయాన్ని రామ్ చరణ్ బుధవారం సోషల్ మీడియా ద్వారా కన్‌‌‌‌ఫర్మ్ చేశాడు.

విజువల్స్ చాలా అందంగా ఉన్నాయని చెప్పిన చరణ్.. తమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడని, శంకర్ ఈపాటను చాలా స్పెషల్‌‌‌‌గా తీశారని, కియారా లుక్ స్టన్నింగ్‌‌‌‌ అంటూ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌‌‌‌లోని అత్యంత అందమైన ప్రదేశాల్లో తీసిన ఈ డ్యూయెట్ సినిమాకు హైలైట్‌‌‌‌గా ఉంటుందన్నారు మేకర్స్. ఈ సాంగ్  షూట్ కోసం పదిహేను కోట్లు ఖర్చు చేశారట నిర్మాతలు.  సౌత్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా ఇది నిలుస్తుందంటున్నారు. చరణ్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 15వ సినిమా. దిల్‌‌‌‌ రాజు నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌‌‌‌, అంజ‌‌‌‌లి, స‌‌‌‌ముద్రఖని, న‌‌‌‌వీన్ చంద్ర, సునీల్, జ‌‌‌‌య‌‌‌‌రామ్ ఇత‌‌‌‌ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు క‌‌‌‌థ‌‌‌‌ను అందిస్తుండగా సాయిమాధ‌‌‌‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.