
నిహాల్ కోదాటి, ఆశ్లేష ఠాకూర్ జంటగా శేషు పెద్దిరెడ్డి దర్శకత్వంలో యిర్రంకి సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘శాంతల’. నిర్మాత కె ఎస్ రామారావు పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమాలోని రెండు పాటలను శనివారం విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ఇదొక ఇన్‌స్పైరింగ్ స్టోరీ. ఇంతమంచి కథలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అన్నారు నిహాల్, ఆశ్లేష. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘చాలాకాలం తర్వాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు శేషు, డీవోపీ రమేష్, ఎడిటర్ శశాంక్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.