వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ: శరద్‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ: శరద్‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌

పుణె: ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) కలిసే పోటీ చేస్తామని ఎన్సీపీ (శరద్‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌) చీఫ్‌‌‌‌ శరద్‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో కూటమిలో భాగమైన చిన్న మిత్రపక్షాల ప్రయోజనాలను అసెంబ్లీ ఎన్నికల్లో పరిరక్షించడం ప్రధాన ప్రతిపక్ష పార్టీల నైతిక బాధ్యత అని అన్నారు. 

రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, దీనిని నెరవేర్చడం ప్రతిపక్షాల కూటమి బాధ్యత అని పేర్కొన్నారు. మహాభారతంలో అర్జునుడు చేప నీడను నీటిలో చూస్తూ పైన తిరుగుతున్న లక్ష్యాన్ని ఛేదించినట్లే.. మన అందరి చూపు మహారాష్ట్ర ఎన్నికలపై ఉండాలన్నారు. 

రాష్ట్రంలో సీట్ల పంపకంపై చర్చలను త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ), శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌‌‌‌లను ప్రజలు ఆదరించారని గుర్తుచేశారు. అయితే, ఈ మూడు పార్టీల మాదిరిగానే వామపక్షాలు, రైతు, కార్మిక పార్టీ (పీడబ్ల్యూపీ) కూడా సంకీర్ణంలో భాగమేనని, కానీ లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వలేకపోయామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చి, ఆ పార్టీల 
ప్రయోజనాలను పరిక్షిస్తామని చెప్పారు.