కనుల పండువగా శారదా దేవి జయంతి

కనుల పండువగా శారదా దేవి జయంతి

హైదరాబాద్, వెలుగు : దివ్య జనని శ్రీ శారదా దేవి 171వ జయంతి వేడుకలు బుధవారం దోమలగూడలోని శ్రీరామకృష్ణ మఠంలో కనుల పండువగా జరిగాయి. ఉదయం 5.30 గంటలకు సుప్రభాతం, మంగళహారతి, భజనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. 6.30 గంటలకు దేవాలయ ప్రదక్షిణం, 7 గంటలకు లలితా సహస్రనామ పారాయణం, 10.30 గంటలకు హోమం నిర్వహించారు.

శారదా దేవి జీవితం, సందేశంపై హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద ప్రసంగించారు. మధ్యాహ్నం 2 గంటలకు శారదాదేవి చలనచిత్రాన్ని ప్రదర్శించారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకంగా రూపొందించిన శారదా మాత బెంగళూరు రాక్ నమూనా దగ్గర ప్రత్యేకపూజలు నిర్వహించారు. రామకృష్ణ మఠం స్వాములు, భక్తులు, వలంటీర్లు పాల్గొన్నారు.