శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అక్టోబర్ 15 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

 శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అక్టోబర్ 15 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం,వెలుగు : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 15 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఈవో రమాదేవి ప్రకటించారు.  శుక్రవారం ఆమె విలేకర్ల సమావేశంంలో మాట్లాడుతూ 15 నుంచి 24వరకు లక్ష్మీతాయారు అమ్మవారు ఆది, సంతాన, గజ, ధన, ధాన్య, విజయ,ఐశ్వర్య,వీర, మహా, నిజరూప లక్ష్మీ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారన్నారు.  9 రోజుల పాటు శ్రీమద్రామాయణ పారాయణం, దశమి రోజు 24న శ్రీరామపట్టాభిషేకం, శ్రీరామలీలా మహోత్సవం ఉంటాయన్నారు.

28న శబరి స్మృతి యాత్రను  నిర్వహిస్తామన్నారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28న సాయంత్రం 5 గంటల లోపు ఆలయం మూసివేస్తామన్నారు. 29 తెల్లవారుఝామున ఆదివారం 4 గంటలకు తలుపులు తెరిచి సంప్రోక్షణ చేస్తామన్నారు. స్వామివారి అభిషేకాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. డిసెంబరు 13 నుంచి 2024 జనవరి 2 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల షెడ్యూల్​ ఖరారు చేశారు.

డిసెంబరు 22 తెప్పోత్సవం, 23న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం ఉంటుందన్నారు.  సౌకర్యాలు, ప్రసాదాలు కల్పించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  సమావేశంలో స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజం(రామం), ఏఈవోలు, ఈఈ  ఉన్నారు.