
నవీన్‌కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘శరపంజరం’. లయ హీరోయిన్. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్. శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సినిమా విజయం సాధించాలని కోరారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ ‘ఇది మట్టి మనుషుల కథ. గంగిరెద్దుల వాళ్ల అబ్బాయితో జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో రూపొందించాం’ అని అన్నాడు. నిర్మాత గణపతి రెడ్డి, రజనీ సాయిచంద్, భోలే షావలి తదితరులు పాల్గొన్నారు.