గద్దర్ అవార్డ్స్‌తో సినీ పరిశ్రమను ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా టెలివిజన్ రంగంలో ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ పేరిట అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 15 మంది సభ్యుల కమిటీకి ఎఫ్‌డీసీ ఎండీ కన్వీనర్‌గా ఉంటారు. నిర్మాత శరత్ మరార్‌ను ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీలో టెలివిజన్ పరిశ్రమ నుండి కె. బాపినీడు, మంజుల నాయుడు, పి. కిరణ్ సహా పలువురు సభ్యులుగా ఉన్నారు.
