పాల పిట్టల్లె ప్రేమ.. షరతులు వర్తిస్తాయి ఫస్ట్ సాంగ్ రిలీజ్

పాల పిట్టల్లె ప్రేమ.. షరతులు వర్తిస్తాయి ఫస్ట్ సాంగ్ రిలీజ్

చైత‌‌‌‌‌‌‌‌న్య రావు(Chaitanya Rao), భూమి శెట్టి(Bhumi Shetty) జంట‌‌‌‌‌‌‌‌గా కుమార‌‌‌‌‌‌‌‌స్వామి(అక్షర) తెరకెక్కించిన చిత్రం షరతులు వర్తిస్తాయి(Sharathulu Varthisthaayi). ‘ఈ సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను శనివారం దర్శకుడు దేవ కట్టా చేతులమీదుగా విడుదల చేశారు. ఓ మంచి రూటెడ్ సినిమాలా అనిపిస్తోందని, పెద్ద విజయం సాధించాలంటూ ఆయన బెస్ట్‌‌‌‌‌‌‌‌ విషెస్ చెప్పాడు. ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె.. పూల సెట్టల్లె ఊగే.. ఈడు రంగుల్లో సింగిడొచ్చే.. రెండు గుండెల్లో నిండే, ఓ గడియలో సెరుకు, సెక్కరై కరిగెలే, ఈ చెలిమిలో తీపి చిలకలే కలిసెలే..’ అంటూ మల్లెగోడ గంగాప్రసాద్ లిరిక్స్ రాశారు.

అరుణ్ చిలివేరు కంపోజ్ చేసిన ఈ పాటను హరిచరణ్, భార్గవి పిళ్లై పాడారు. గమ్మత్తైన లిరిక్స్‌‌‌‌‌‌‌‌తో చిన్న ఫిలాసఫీతో సాగే ఈ పాట ఆకట్టుకుంటుందని చైతన్య రావ్ అన్నాడు. వెస్ట్రన్ స్టైల్‌‌‌‌‌‌‌‌లో ఉండే ట్యూన్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ సాహిత్యంతో కూడిన ఈ పాట అందరికీ నచ్చుతుంది’ అని కుమారస్వామి చెప్పారు. చిన్న చిన్న పదాలతో పెద్ద లవ్ ఫిలాసఫీ చెప్పేలా ఈ పాట రాశానని లిరిక్ రైటర్ గంగా ప్రసాద్ తెలిపారు.