- 37 శాతం వరకు పెరిగిన 25 షేర్లు
- కీలక ఇండెక్స్లూ పైకే
బిజినెస్ డెస్క్, వెలుగు: గ్లోబల్‌గా క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పాటు యూఎస్ బాండ్ ఈల్డ్‌లు దిగొస్తుండడంతో దేశ స్టాక్ మార్కెట్‌లు గత రెండు వారాలుగా లాభపడుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపు ఎక్కువగానే ఉంటుందనే సంకేతాలను ఫెడ్ ఇచ్చినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీలు ఈ వారం సుమారు 2% పెరిగాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు అయితే ఏకంగా 3 శాతం వరకు లాభపడ్డాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు ఈ వారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ ఇండెక్స్ 4% లాభపడింది. బ్యాంకెక్స్, పీఎస్ యూ ఇండెక్స్‌లు 3 శాతం వరకు పెరగడం చూశాం. మెటల్స్, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రా షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. దేశ ఎకానమీ ఇండికేటర్లు మెరుగ్గా ఉండడం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల రాక కొనసాగుతుండడం, కార్పొరేట్ కంపెనీల పనితీరు మెరుగుపడుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఈ వారం బ్యాంకింగ్, కన్జంప్షన్ షేర్లపై ఇన్వెస్టర్లు ఎక్కువ ఫోకస్ పెట్టారని వివరించారు. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో 360 షేర్లు కిందటి వారం లాభాల్లో ముగిశాయి. కనీసం 25 షేర్లు రెండంకెల గ్రోత్‌ను సాధించాయి. కేవలం రెండు షేర్లు మాత్రమే 10 శాతం పైగా నష్టపోయాయి.
ఇన్వెస్టర్లకు వారంలో భారీ లాభాలిచ్చిన షేర్లు..
1 ఈ వారం టెక్ కంపెనీ అయిన వాక్రాంజి షేరు 37 శాతం లాభ పడడం విశేషం. కంపెనీ షేరు శుక్రవారం రూ. 37.70 వద్ద క్లోజయ్యింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ షేరు ఇన్వెస్టర్లకు రెండంకెల రిటర్న్‌ను ఇచ్చింది. కంపెనీ షేర్లు కూడా ఎక్కువ వాల్యూమ్స్‌తో కదిలాయి. ఎక్కువ వాల్యూమ్స్‌కు సంబంధించి ఈ కంపెనీ నుంచి క్లారిఫికేషన్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు కోరాయి.
2 మురుగప్ప గ్రూప్‌కు చెందిన టూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా షేరు వారం రోజుల్లోనే 19 శాతం పెరిగింది. శుక్రవారం ఈ షేరు రూ.2,743 వద్ద క్లోజయ్యింది. కంపెనీ సబ్సిడరీ అయిన టీఐ క్లీన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అవ్వడంతో టూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా షేరు భారీగా లాభపడింది.
3 డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీ ఏంజెల్ వన్ ఈ వారం ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కంపెనీ క్లయింట్ బేస్ 1.118 కోట్లకు పెరగడంతో ఏంజెల్ వన్ షేరు గత ఐదు సెషన్లలో 16 శాతం లాభపడింది. ఈ కంపెనీ షేరు శుక్రవారం రూ.1,579 వద్ద ముగిసింది. ఏంజెల్ వన్ షేరుపై బ్రోకరేజి కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ బై కాల్‌ను ఇచ్చింది. టార్గెట్ ధరను రూ. 1,865 గా నిర్ణయించింది. ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ గతంలో ఇచ్చిన టార్గెట్ ధర రూ. 1,560 ను ఏంజెల్ వన్ షేరు ఇప్పటికే అధిగమించింది.
4 జేకే లక్ష్మీ సిమెంట్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, తాన్లా ప్లాట్‌ఫామ్స్ షేర్లు కూడా కిందటి వారంలో 18 శాతం వరకు లాభపడ్డాయి. షేరు ధర రూ. 1,200 వద్ద రూ. 170 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయడానికి తాన్లా బోర్డు ఆమోదించిన విషయం తెలిసిందే. తాన్లా ప్లాట్‌ఫామ్ షేరుపై యెస్ సెక్యూరిటీస్ బై కాల్‌ను ఇచ్చి టార్గెట్ ధరను రూ. 1,218 గా నిర్ణయంచింది.
5 శ్రీ సిమెంట్, స్చాఫ్లర్ ఇండియా, థైరోకేర్ టెక్నాలజీస్, నెస్కో, బిర్లా కార్పొరేషన్ షేర్లు ఈ వారం 14 శాతం నుంచి 17 శాతం ఎగిశాయి.
6 సెరా శానిటరీవేర్, మహారాష్ట్ర స్కూటర్స్, ఆస్ట్రాల్, హ్యాట్సన్ ఆగ్రో, కాన్‌కర్, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, లెమన్ ట్రీ, పీఎన్‌బీ, క్వెస్ కార్ప్, వాక్హర్ట్, వైభవ్ గ్లోబల్, డిక్సన్ టెక్నాలజీస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, ఈసబ్ ఇండియా షేర్లు 10% చొప్పున లాభపడ్డాయి.
7 మరోవైపు టాటా టెలీసర్వీసెస్ (మహారాష్ట్ర), ఎంఎంటీసీ షేర్లు కిందటి వారంలో 11 శాతం నుంచి 16 శాతం పడ్డాయి.
