షేర్ చాట్‪లో ఉద్యోగాల కోత

షేర్ చాట్‪లో ఉద్యోగాల కోత

ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగుల్ని తొలగిస్తున్న కంపెనీల లిస్టులో షేర్ చాట్ కూడా చేరింది. ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ తరహాలోనే ఎంప్లాయిస్ కు పింక్ స్లిప్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 20శాతం మందిని తొలగించనున్నట్లు షేర్ చాట్ ప్రకటించింది. గత ఆరు నెలలుగా షేర్ చాట్ బోర్డు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షేర్ చాట్ తో పాటు దాని అనుబంధ సంస్థ షార్ట్ వీడియోస్ యాప్ మోజ్ సైతం ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.  

సోషల్ మీడియాలో టాప్ లో దూసుకుపోతున్న షేర్ చాట్ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం 5మిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీలో 2,200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో 500మందికిపైగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపే అవకాశముంది.