అదానీని వీడని హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ నీడ

అదానీని వీడని హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ నీడ
  • కంపెనీలోని యూఎస్ ఇన్వెస్టర్లను ఎంక్వైరీ చేస్తున్న అక్కడి అధికారులు 
  • తమకు ఈ విషయం తెలియదన్న అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ  గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్లను హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ వదలడం లేదు. కంపెనీ షేర్లు తాజాగా మళ్లీ 10 శాతం వరకు పడ్డాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.55 వేల కోట్లు తగ్గింది.  ఈసారి  కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన అతిపెద్ద యూఎస్ ఇన్వెస్టర్లను  అక్కడి అథారిటీస్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ చేస్తున్నారని రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. అది కూడా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేముందు అదానీ గ్రూప్ ఎటువంటి డిటైల్స్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చిందనే అంశంపై ఎంక్వైరీస్ చేస్తున్నారని బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ పేర్కొంది. గత రెండు నెలలుగా ప్రాసెస్ జరుగుతోందని ఓ సోర్స్‌‌‌‌‌‌‌‌ను కోట్ చేస్తూ వెల్లడించింది.  

మరోవైపు ఇన్వెస్టర్లను యూఎస్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారనే  విషయం తమకు తెలియదని అదానీ గ్రూప్  క్లారిటీ ఇచ్చింది. కంపెనీ  డిస్‌‌‌‌‌‌‌‌క్లోజర్స్ సరిగ్గా ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్ కంపెనీల ద్వారా  షేర్ల ధరలను అదానీ గ్రూప్ మానిప్యులేట్ చేసిందని ఈ ఏడాది జనవరిలో  హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూ తర్వాత అమెరికన్ ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ ఎటువంటి డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులో ఉంచిందని తెలుసుకునేందుకు  యూఎస్‌‌‌‌‌‌‌‌ అథారిటీస్ ఎంక్వైరీస్ చేస్తున్నారు. 

ఇండియాలో కూడా కొనసాగుతున్న దర్యాప్తు

గత రెండు మూడు నెలలుగా అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో పెద్ద మొత్తంలో హోల్డింగ్స్ ఉన్న ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్ల ఇన్వెస్టర్లకు  న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లోని యూఎస్‌‌‌‌‌‌‌‌ అటార్నీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీస్ పంపిందని బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ చేసింది. అదానీ గ్రూప్ తమకు ఏం చెప్పిందనే విషయాలపై ఈ ఆఫీస్ ఫోకస్ పెట్టిందని వెల్లడించింది. మరోవైపు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ కమిషన్ కూడా ఇలాంటి దర్యాప్తునే జరుపుతోందని వివరించింది. కాగా, యూఎస్ ప్రాసిక్యూటర్స్  ఇన్వెస్టర్ల నుంచి వివరాలను కోరినంత మాత్రాన క్రిమినల్ లేదా సివిల్ కేసులు ఫైల్ అయినట్టు కాదు.

హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత నుంచి అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌పై స్క్రూటినీ బాగా పెరిగింది. ఇండియాలో ఈ కంపెనీపై దర్యాప్తులు జరుగతున్నాయి కూడా. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన ఆరోపణలను  దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టులో చాలా పిటిషన్‌‌‌‌‌‌‌‌లు ఫైల్ అయ్యాయి. ఈ ఇష్యూపై దర్యాప్తు జరపాలని సెబీకి సుప్రీం కోర్ట్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు కూడా ఇచ్చింది. తాజాగా ఆరు మెంబర్ల ప్యానెల్ తన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను కూడా సబ్మిట్ చేసింది. స్టాక్ మానిప్యులేషన్ జరిగిందని చెప్పలేమని ఈ రిపోర్ట్ పేర్కొంది. 

అదానీ డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌కు ఫండ్స్‌‌‌‌‌‌‌‌

అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌, ఎడ్జ్‌‌‌‌‌‌‌‌కనెఎక్స్‌‌‌‌‌‌‌‌ (ఈసీఎక్స్‌‌‌‌‌‌‌‌) జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ అదానీ కనెఎక్స్‌‌‌‌‌‌‌‌ 213 మిలియన్ డాలర్ల (రూ.1,740 కోట్ల) ను సేకరించింది. నిర్మాణంలో ఉన్న  డేటా సెంటర్లకు ఫైనాన్స్ ఇవ్వడానికి ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను వాడనుంది.  ప్రస్తుతం చెన్నై, నోయిడాలోని నిర్మాణంలో ఉన్న కంపెనీ డేటా సెంటర్ల కెపాసిటీ   67 మెగావాట్స్‌. ఐఎన్‌‌‌‌‌‌‌‌జీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌వీ, మిజుహో బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఎంయూఎఫ్‌‌‌‌‌‌‌‌జీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, నాటిక్సిస్‌‌‌‌‌‌‌‌, స్టాండర్డ్ ఛార్టర్డ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, సుమిటోమో మిత్సుసి బ్యాంకింగ్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లు కంపెనీకి అప్పులిచ్చేందుకు ముందుకొచ్చాయి. చెన్నై1 క్యాంపస్‌‌‌‌‌‌‌‌లోని 17 మెగా వాట్లా డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, నోయిడా క్యాంపస్‌లోని 50 మెగా వాట్ల డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించడానికి ఈ ఫండ్స్ వాడతామని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

‘ఫెసిలిటీలను నిర్మించడం చాలా ముఖ్యం. మా క్యాపిటల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. 2030 నాటికి  ఒక గిగావాట్స్ కెపాసిటీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమవుతుంది’ అని అదానీ కనెఎక్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ జయకుమార్ జానకరాజ్ అన్నారు. దేశంలో డేటా సెంటర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగంగా విస్తరిస్తోంది. 2019లో 540 మెగావాట్లుగా ఉన్న ఈ సెక్టార్ కెపాసిటీ, 2023 నాటికి 800 మెగావాట్స్‌‌‌‌‌‌‌‌కు పెరిగింది. క్రిసిల్ అంచనాల ప్రకారం, 2025 నాటికి ఈ నెంబర్ 1,700 నుంచి 1,8‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 మెగావాట్స్‌‌‌‌‌‌‌‌కు పెరుగుతుందని అంచనా. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ వస్తాయని అవెండస్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ రిపోర్ట్ చేసింది.