
ప్రపంచ ప్రఖ్యాత తైవానీస్ బబుల్ టీ బ్రాండ్ 'షేర్‌టీ' (Sharetea) హైదరాబాద్ నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. యువత, ఫుడీస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ బ్రాండ్... హైటెక్ సిటీలోని ఇన్ ఆర్బిట్ మాల్‌లో తమ సరికొత్త ఔట్‌లెట్‌ను తెరిచింది. ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ ఈ ఔట్‌లెట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీ రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీలు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 'షేర్‌టీ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తైవానీస్ బబుల్ టీ నగరానికి వచ్చిందన్నారు. ఈ అద్భుతమైన కొత్త రుచిని యువత ఖచ్చితంగా ఆస్వాదిస్తారు అని ఆయన అన్నారు. సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ ఈ ప్రారంభోత్సవానికి రావడంతో, ఈ బ్రాండ్‌కు మంచి ప్రచారం లభించింది.
ప్రపంచవ్యాప్తంగా 'షేర్‌టీ' విస్తరణ
1992లో తైవాన్‌లో స్థాపించబడిన 'షేర్‌టీ'.. తన నాణ్యమైన తాజా టీలు, ప్రీమియం ఇంగ్రేడియంట్స్, విస్తృత శ్రేణి ఫ్లేవర్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ బ్రాండ్ ఇప్పుడు 13కు పైగా దేశాల్లో 500కు పైగా స్టోర్లతో ప్రపంచమంతా విస్తరించింది. ఈ బ్రాండ్ పేరులోనే ఉన్నట్టుగా... "Share Happiness, Sharetea" అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. టీ తాగే అనుభవాన్ని కేవలం పానీయంగా కాకుండా, ఆనందంగా పంచుకునే క్షణంగా మారుస్తుంది.
కస్టమైజ్డ్ బబుల్ టీ అనుభవం
'షేర్‌టీ' యొక్క ప్రత్యేకత దాని కస్టమైజేషన్ ఆప్షన్స్. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నచ్చిన రీతిలో అందిస్తారు. ప్రస్తుతం ఈ టీ వివిధ ఫ్రూట్ ప్లేవవర్లలో కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో వేగంగా యువత నుంచి ఆదరణ పొందుతున్న బబుల్ టీ కల్చర్ కి అనుగుణంగా తమ ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. క్లాసిక్ మిల్క్ టీలు, ఫ్రూట్ టీలు, ప్రత్యేకమైన టేకా బబుల్ వంటికి సిటీ టీ లవర్స్ కి అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రారంభోత్సవంలో నగరంలోని పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫుడ్ లవర్స్, మాల్ కి వచ్చిన షాపర్లు పాల్గొని కొత్త రుచులను ఆస్వాదించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న గ్లోబల్ ఫుడ్ ట్రెండ్‌కు అనుగుణంగా, అత్యుత్తమ నాణ్యత, కొత్త రుచులను కోరుకునే నగర యువతకు 'షేర్‌టీ' తప్పకుండా కొత్త 'గో-టూ' డెస్టినేషన్ అవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.