చంద్రబాబుతో నాకు మంచి సన్నిహితం ఉంది : షర్మిల

 చంద్రబాబుతో నాకు మంచి సన్నిహితం ఉంది : షర్మిల

ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తనకు మంచి సన్నిహితం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. చంద్రబాబును తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించానని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డల పెళ్లిల్లకు కూడా చంద్రబాబు వచ్చారని షర్మిల తెలిపారు. వైఎస్ ఆర్ గురించి చంద్రబాబు ప్రస్తావించారని వారిద్దరికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారని చెప్పారు. 

 చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధాలు లేవని షర్మిల తెలిపారు. తాను కాంగ్రెస్ లో ఉన్నానని చంద్రబాబు టీడీపీ అధినేతగా కొనసాగుుతన్నారని తెలిపారు. తనకు ఏ పదవి ఇవ్వాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ ప్ రధాని అయితే మంచి జరుగుతుందని షర్మిల చెప్పారు. లీడర్లు ఉన్నది ప్రజల కోసమే కానీ పార్టీల కోసం కాదని షర్మిల చెప్పారు.