ఖమ్మంలో షర్మిళ సభకు విజయమ్మ కూడా వస్తారు

ఖమ్మంలో షర్మిళ సభకు విజయమ్మ కూడా వస్తారు
  • షర్మిళ ముఖ్య అనుచరురాలు ఇందిరా శోభన్ 

హైదరాబాద్: ఎల్లుండి ఖమ్మంలో షర్మిళ నిర్వహించాల్సిన సభ ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుందని.. ఆ సభకు విజయమ్మ కూడా హాజరు అవుతున్నారని షర్మిళ ముఖ్య అనుచరురాలు ఇందిరా శోభన్ వెల్లడించారు. ఖమ్మం సభ విషయంలో తమకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేవని, షర్మిళ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సభ విషయంలో అనుమానాలు అవసరం లేదని.. కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తామని ఆమె స్పష్టం చేశారు. నిన్న చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, నిన్న కేసీఆర్ గోదావరి నీటి విడుదల కోసం వెళ్లారు, కాబట్టి షర్మిళ సభ జరగదేమోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సంకల్ప  సభ జరిగి తీరుతుందన్నారు. పార్టీ ఏర్పాటు వెనుక తన సంకల్పాన్ని సభలోనే అందరి ముందు షర్మిళ బహిరంగంగా ప్రకటన చేస్తారని ఆమె తెలిపారు. తెలంగాణ.ప్రజల హక్కులు కాపాడటం కోసమే షర్మిలమ్మ  మన ముందుకు వస్తుందని, ఖమ్మం వెళ్లే దారిలో అడుగు అడుగున స్వాగత కార్యక్రమాలు ఉన్నాయని ఆమె వివరించారు. సాయంత్రం 5 గంటలకు సభ కోసం తమకు అనుమతి ఇచారని, తెలంగాణ హక్కులు సాధించేందుకు షర్మిల ముందుకు వస్తోందని, సంకల్ప సభ కు వై ఎస్ విజయమ్మ కూడా హాజరు అవుతున్నందున అందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల సభలు జరుగుతున్నాయి.. సభల విషయంలో పాలకులకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయా తమకు కూడా సభకు సంబంధించి అవే రూల్స్ వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు. 
షర్మిళ సభ రూట్ మ్యాప్ ఇదే: పిట్టా రాంరెడ్డి
ఖమ్మంలో షర్మిళ సభ కోసం జనం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని, లోటస్ పాండ్ లో ఆమె బయలుదేరడం మొదలు మార్గం మధ్యలో జరిగే కార్యక్రమాల గురించి రూట్ మ్యాప్ ఖరారైందని షర్మిళమ్మ అనుచరుడు పిట్టా రాంరెడ్డి వెల్లడించారు. ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరి కోటి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఎల్ పీటీ మార్కెట్ వద్ద, హయత్ నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, చివ్వేంల మీదుగా షర్మిళ వెళతారని.. ఇవేకాకుండా పలు గ్రామాలకు చెందిన ప్రజలు షర్మిళను తమ గ్రామం వద్ద ఆగాలని ఇప్పటికీ కోరుతున్నారని ఆయన వివరించారు. కోదాడ, నుంచి పాలేరు కు 3.30 కు చేరుకుంటారని, పెద్ద తండాలో వైస్సార్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి పెవిలియన్ గ్రౌండ్ కి షర్మిళ చేరుకుని అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి అన్ని విషయాలు మాట్లాడతారని తెలిపారు.