కేసీఆర్ ఎస్సారెస్పీ నీ సొంత ఆస్తా ? : వైఎస్. షర్మిల

కేసీఆర్  ఎస్సారెస్పీ నీ సొంత ఆస్తా ? : వైఎస్. షర్మిల

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్.. అధికారం కోసం ఇప్పుడు పక్క రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సాఆర్టీపీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.  తెలంగాణను వదిలేసి మహారాష్ట్రకు నీళ్లు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో జై తెలంగాణ అనే దమ్ములేని ముఖ్యమంత్రి.. వారిని సొంత ఆస్తి అన్నట్లు శ్రీరాం సాగర్ నీళ్లు తీసుకుపొమ్మంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు దోచిపెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.  తనకు ఏ  అధికారం ఉందని కేసీఆర్ గోదావరి నీళ్లను తీసుకుపొమ్మని అంటున్నారని షర్మిల నిలదీశారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలపై ఆవేదన వ్యfarక్తం చేస్తున్న కేసీఆర్.. మరి తెలంగాణలో బలవన్మరణాలకు పాల్పడ్డ అన్నదాతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గత 8ఏండ్లలో దాదాపు 8వేల మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అఫీషియల్ రిపోర్టులే చెబుతున్నాయని షర్మిల స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుంటుబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని, రాష్ట్ర రైతుల ప్రాణాలకు ఆయన ఇచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నించారు. 

తెలంగాణ ఖజానాను దోచుకున్న కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నాడని షర్మిల ఆరోపించారు. రుణమాఫీ, కేజీ టూ పీజీ విద్య, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం, పింఛన్లు ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.